తాడ్వాయి, వెలుగు : మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజతో కలిసి ఆమె పరిశీలించారు. జంపన్న వాగు వాచ్ టవర్స్, హరిత హోటల్, భక్తులు విడిది చేసే గోవిందరాజు, పగిడిద్దరాజు భవనాలు, మీడియా పాయింట్ వాచ్ టవర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతరకు వచ్చే వీవీఐపీలు
వీఐపీలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ఈ నెలాఖరు నాటికి హోటల్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే నెల 21 నుంచి 24 వరకు జరిగే మహా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు, పూజారులు సమన్వయం పనిచేయాలని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఈఈ అజయ్‌కుమార్, డీపీవో వెంకయ్య పాల్గొన్నారు.