మాతా, శిశు మరణాలను తగ్గించాలి : ఇలా త్రిపాఠి

మాతా, శిశు మరణాలను తగ్గించాలి : ఇలా త్రిపాఠి
  •  కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలో మాతా, శిశు మరణాలను తగ్గించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం  కలెక్టరేట్​లో వైద్యారోగ్యశాఖ అధికారులు, ఆశ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవగాహన లోపం, మూఢనమ్మకాల కారణంగా గ్రామాల్లో మాతా, శిశు మరణాలు సంభవించడం బాధాకరమన్నారు. ఇకపై జిల్లాలో ఎలాంటి మాతా, శిశు మరణాలు సంభవించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మాతా, శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

మహిళ గర్భం దాల్చిన తర్వాత ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వారికి ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలని, అవసరమైతే వైద్యాధికారులు గర్భిణులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. రెండు నెలలతో పోలిస్తే జిల్లాలో మాతా, శిశు మరణాల సంఖ్య తగ్గిందని, దీంతో వైద్యాధికారులు, ఆశ కార్యకర్తలను అభినందించారు. సమావేశంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ఎస్ డాక్టర్ మాతృనాయక్, డిప్యూటీ డీఎంహెచ్ వోలు, డాక్టర్లు, పాల్గొన్నారు. 

ఉద్యోగులు తన కుటుంబ సభ్యులాంటి వారు

ఉద్యోగులు తన కుటుంబ సభ్యుల్లాంటివారని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన టీజీవో డైరీని ఆమె ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు.