
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్గొండ అర్బన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గృహ నిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఒక్కోటి రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లును నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది.
జిల్లాకు పంపిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని శనివారం తన ఛాంబర్ లో కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదామును తనిఖీ చేశారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్వో అశోక్ రెడ్డి పాల్గొన్నారు.