గిరిజన గ్రామాల్లో పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం : కలెక్టర్​ త్రిపాఠి

గిరిజన గ్రామాల్లో పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం : కలెక్టర్​ త్రిపాఠి

హాలియా, వెలుగు : గిరిజన గ్రామాల్లో ధర్తీ ఆబ జన్​జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్​ను పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మౌలిక వసతుల కల్పనకై బుధవారం రంగుండ్ల తండాను ఆమె సందర్శించారు. ధర్తీ ఆబ జన్​జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ పథకంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ ప్రధాని మోదీ గత నవంబర్ 15న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారని తెలిపారు. రంగుండ్ల తండాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. గ్రామ పరిధిలోని ప్రభుత్వ సంస్థల్లో సోలార్ లైట్లు ఏర్పాటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   

పంటకు సాగునీరందేలా చర్యలు తీసుకోవాలి 

 పంటకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం పెద్దవూర మండలం కుంకుడుచెట్టు తండా పరిధిలోని పంట పొలాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయకట్టు చివరి భూములకు వెళ్తున్న నీటిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇరిగేషన్ అధికారులతోపాటు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు సాగునీటిని మానిటరింగ్ చేయాలన్నారు. ఎక్కడైనా నీరు వృథాగా పోతుంటే వెంటనే నియంత్రించాలని చెప్పారు. రైతులు పంట కాల్వలను తెంపకుండా చూడాలన్నారు. ఎవరైనా కాల్వలకు గండ్లు కొట్టి నీరు మళ్లించుకోవడానికి ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.