![వారం రోజుల్లో చెరువులను నింపాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి](https://static.v6velugu.com/uploads/2025/02/collector-ila-tripathi-said-ponds-should-be-filled-within-a-week_e5iawzTyLv.jpg)
నార్కట్పల్లి, వెలుగు : బ్రాహ్మణ వెల్లెంల లెఫ్ట్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ నుంచి నీటిని విడుదల చేసి వారం రోజుల్లో అమరవాణి, అప్పాజీపేట దోమలపల్లి, కాకులకొండారం, నర్సింగ్ బట్ల చెరువులను నింపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్, ఉదయ సముద్రం ఎడమ కాల్వ పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్లెంల ఎడమ కాల్వ డిస్ట్రిబ్యూటరీ నుంచి వారం రోజుల్లో అమరవాణి అప్పాజీపేట, దోమలపల్లి చెరువులను నింపాలన్నారు.
కంచెనపల్లి చెరువు వరకు నీరు ఇవ్వాలని, నర్సింగ్ బట్ల చెరువులను సైతం నింపాలని చెప్పారు. అన్నపర్తి, బుద్ధారం చర్లపల్లి భీమా సముద్రాన్ని లింక్ చైన్ ఉన్న చెరువులను నింపేందుకు ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, నీటిపారుదలశాఖ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ విఠలేశ్వర్, ఏఈ నవీన్, నార్కెట్ పల్లి తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.