పరీక్షల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం : త్రిపాఠి

పరీక్షల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకం : త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ –3 పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం కలెక్టరేట్​లో గ్రూప్–-3 పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. 

ఓఎంఆర్ సీట్లు, కాన్ఫిడెన్సిల్ మెటీరియల్ నిర్వహణపై ఇన్విజిలేటర్లకు ముందే తెలియజేయాలన్నారు. పరీక్షకు సంబంధించి అన్ని విషయాలపై అవగాహన ఉండాలని, పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా తనిఖీలు చేయాలని చెప్పారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.   

ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలి..

నకిరేకల్, వెలుగు:  రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని, లేదంటే కేంద్రం నిర్వాహకులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. నకిరేకల్ మండలం, చందుపట్ల, తాటికల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.