ములుగు, వెలుగు : జిల్లాకు కొత్తగా వచ్చిన 200బ్యాలెట్ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం కలెక్టరేట్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ శ్రీజ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు. ములుగు అసెంబ్లీ సెగ్మెంట్, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 23 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని
మొత్తం 2బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయని, 200 బ్యాలెట్ యూనిట్లు కొత్తగా వచ్చాయని, పోలింగ్ లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సత్యాపాల్ రెడ్డి, తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, రవీందర్ పాల్గొన్నారు.
ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్
జనగామ అర్బన్, వెలుగు : జనగామ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్లో 2200 బ్యాలెట్ యూనిట్ల మొదటి దశ తనిఖీ జరిగింది. కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఈవీఎంల తనిఖీని పరిశీలించారు. ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తామని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.
మహబూబాబాద్,వెలుగు : కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఈవీఎం రాండమైజేషన్ ను జనరల్ అబ్జర్వర్ రచిత్ రాజ్, ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమక్షంలో నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరు జాగ్రత్తగా నిర్వహించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ నితేష్ వ్యాస్ సిబ్బందికి సూచించారు.