ఆడపిల్లలు అన్నిరంగాల్లో రాణించాలి : ఇలా త్రిపాఠి

ఆడపిల్లలు అన్నిరంగాల్లో రాణించాలి : ఇలా త్రిపాఠి
  • కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నల్గొండ అర్బన్, వెలుగు : ఆడపిల్లలు చదువుతోపాటు అన్నిరంగాల్లో రాణించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో నల్లగొండలోని క్లాక్ టవర్ వద్ద ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బేటి బచావో.. బేటి పడావోపై ఏర్పాటు చేసిన పోస్టర్ ను ఆవిష్కరించారు. 

అనంతరం ఆమె మాట్లాడుతూ ఆడ పిల్లలను చదివించాలని, వారు చదువుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. బేటీ బచావో..- బేటీ పడావో పదేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాలలు,  కళాశాలలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో మహిళలు, విద్యార్థినులకు మార్చి 8 వరకు భ్రూణ హత్యల నివారణ, బాలికా విద్యను పోత్సహించడం, మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. 

బాలికలు భవితకు సోపానం..

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరిగింది. కలెక్టరేట్​లో నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్​గంగాధర్​మాట్లాడుతూ బాలికలు భారం కాదని, భవితకు సోపానం అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ స్కూల్స్​కు చెందిన స్టూడెంట్స్​ కళారూపాలు ప్రదర్శించారు. స్టాప్​ వయోలెన్స్, సేవ్​ గర్ల్స్​ అంటూ స్టూడెంట్స్​ ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఆటల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన స్టూడెంట్స్​కు బహమతులు అందించారు.