ములుగు, వెలుగు : వేసవిలో ఎండతీవ్రత ఎక్కువగా ఉండగా, ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయని, ప్రజలు వడదెబ్బ నుంచి తమను తాము రక్షించుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో వైద్యారోగ్య శాఖ రూపొందించిన ‘వడదెబ్బ నుంచి రక్షించుకుందాం’ అనే వాల్ పోస్టర్ ను అడిషనల్కలెక్టర్ శ్రీజతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డీపీవో స్వరూప, ప్రోగ్రాం ఆఫీసర్ పవన్ పాల్గొన్నారు.