కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన  కలెక్టర్

కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన  కలెక్టర్

నల్గొండ అర్బన్, వెలుగు : నల్గొండలోని కేంద్రీయ విద్యాలయాన్ని బుధవారం  కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యాలయాన్ని సందర్శించారు. ప్రిన్సిపాల్  జీ శ్రీనివాసులు, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, టీచర్లు, స్టూడెంట్స్ కలెక్టర్ కు  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.   విద్యార్థులు విద్యారంగంలో పైకి రావడానికి టీచర్లు తో పాటు పేరెంట్స్ కూడా బాధ్యత వహించాలని చెప్పారు.

అనంతరం 53వ  కేవీఎస్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ ఖోఖో లో మెడల్స్ సాధించిన 5 గురు విద్యార్థినులకు హైదరాబాద్ రీజినల్ ఆఫీసు నుంచి వచ్చిన క్యాష్ అమౌంట్ ను   ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ సభ్యులు శంకరయ్య, అనురాధ, నర్సిరెడ్డి టీచర్లు ఎం. రవి కుమార్, కె. సందీప్, నెహ్రా పాల్గొన్నారు.