తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేటలోని సమ్మక్క ఆలయాన్ని సోమవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. ఆలయ పరిసర ప్రాంతాలను క్లీన్ చేయాలని ఆదేశించారు. అనంతరం మేడారంలోని శానిటేషన్ స్టోర్ బిల్డింగ్ నిర్మాణ పనులను పరిశీలించారు. భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అనంతరం ఐటీడీఏ గెస్ట్‌హౌజ్‌లో పార్కింగ్ ప్లేస్, పనుల పురోగతికి సంబంధించి ఇంజనీరింగ్, ఎండోమెంట్, ఈజీఎస్ శాఖల ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీఐపీ, వీవీఐపీ పార్కింగ్ ప్లేస్‌లలో కల్వర్టు పనులు, పిచ్చి మొక్కల తొలగింపును స్పీడప్ చేయాలని, దెబ్బతిన్న రోడ్లకు వెంటనే రిపేర్లు చేయాలని ఆదేశించారు. ఆమె వెంట ఈవో రాజేంద్ర, డీపీవో వెంకయ్య ఉన్నారు.