ఇంటర్‌‌ సెంటర్లను పరిశీలించిన కలెక్టర్

నల్గొండ అర్బన్, వెలుగు: ఇంటర్మీడియట్ పరీక్షల్లో పొరపాట్లకు తావు ఇవ్వొద్దని కలెక్టర్ దాసరి హరిచందన సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్  మున్వర్ అమీనాను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ప్రగతి జూనియర్ కాలేజీలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని  తనిఖీ చేశారు. ఆమె వెంట తహసీల్దార్ శ్రీనివాస్, డిపార్ట్‌మెంటల్ అధికారులు ఎంఏ ఖలీమ్, సాజీద్ మున్వర్ ఉన్నారు.