యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు తనిఖీలు చేపట్టారు. రైతుభరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ సభలు ముగిసిన సందర్భంగా మండల వ్యాప్తంగా వచ్చిన దరఖాలస్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో అమలు చేయబోయే పథకాలైన ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక గురించి చర్చించారు. నిస్పక్షపాతంగా లబ్దిదారుల ఎంపిక ఉండాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు.