ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

వర్ని , వెలుగు: మండలం లోని జాకోరా, జలాల్పూర్ గ్రామాల్లో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు.   ట్రక్ షీట్స్ వచ్చాయా, బిల్ టాగ్ అయ్యిందా, కొత్త గన్నీ బ్యాగులు అందాయా అని ఆరా తీశారు.  

అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా సరిపడా టార్పాలిన్లను అందుబాటులో  ఉంచాలని ఆదేశించారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం, కుప్పలుగా చేసి నిలువ ఉంచడం వల్ల ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.   ఖాళీ స్థలాలు, మైదాన ప్రాంతాల్లో ధాన్యం ఆరబెట్టుకోవాలన్నారు.  కలెక్టర్ వెంట డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్​ డీ ఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.