- వెంటనే బిల్లులు నిలిపివేయండి
- డీఈవో పైనా అసంతృప్తి
- వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్
కొడంగల్, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మౌలిక వసతులు కల్పించాలని అధికారులను వికారాబాద్ కలెక్టర్ప్రతీక్ జైన్ఆదేశించారు. గురువారం కొడంగల్ లో అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను పరిశీలించి కలెక్టర్అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులకు పేమెంట్(బిల్లులు)ను వెంటనే నిలిపి వేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జడ్పీ బాయ్స్ స్కూల్లో టాయిలెట్స్ ను పరిశీలించేందుకు కలెక్టర్ వెళ్లగా తాళం వేసి ఉంది. టాయిలెట్‌కు ఎక్కడికి పోతారని విద్యార్థులను ప్రశ్నించగా బయటకు వెళ్తామంటూ సమాధానం ఇచ్చారు. దీంతో డీఈవో రేణుకాదేవిపై కలెక్టర్సీరియస్ అయ్యారు. స్కూల్ లో టాయిలెట్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆదేశించారు. కడా స్పెషల్ఆఫీసర్ వెంకట్‌రెడ్డి, డీఎంహెచ్ఓ పల్వాన్ కుమార్, తహసీల్దార్ విజయ్‌కుమార్, కమిషనర్బలరాం నాయక్, ఎంఈఓ రాంరెడ్డి, ప్రశాంత్ఉన్నారు.
చదువుతోనే గుర్తింపు
చదువుతోనే సమాజంలో గుర్తింపు వస్తుందని కలెక్టర్ప్రతిక్జైన్పేర్కొన్నారు. నేషనల్డీ వార్మింగ్‌డే సందర్భంగా కొడంగల్టౌన్ లోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు ఆల్బెండజోల్ మందులు పంపిణీ చేశారు. విద్యార్థులు మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ సూచించారు.