31లోపు కోనో కార్పస్​ మొక్కలు తొలగించాలి

31లోపు కోనో కార్పస్​ మొక్కలు తొలగించాలి
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ నెల 31లోపు జిల్లా వ్యాప్తంగా కోనో కార్పస్ ​మొక్కలను తొలగించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్​ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. తొలగించిన కోనో కార్పస్​ మొక్కల స్థానంలో పగోడా మొక్కలు  నాటాలని సూచించారు. సీజనల్​ వ్యాధులు విజృంభిస్తున్న టైంలో ఆఫీసర్లు శానిటేషన్​పై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలని చెప్పారు.

జిల్లాలో మందుల కొరత ఉందనే విషయం తన దృష్టికి వచ్చిందని, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పంచాయతీల వారీగా ఓటరు జాబితా తయారీ ఆశించిన స్థాయిలో జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఆర్​డీవో విద్యాచందన, డీపీవో చంద్రమౌళి, పంచాయతీ రాజ్​ ఈఈ శ్రీనివాసరావు, ఆర్​అండ్​బీ ఈఈ వెంకటేశ్వరరావుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.