కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ పై ఆందోళన చేస్తున్న రైతులపై కలెక్టర్ జితేశ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యపై గొడవ చేయాలనుకుంటే చేస్కోండని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. కొందరు లేని సమస్యను సృష్టిస్తూ ఉద్దేశపూర్వకంగా రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తనకు ఇదొక్కటే ఇష్యూ కాదన్న కలెక్టర్ జితేశ్.. తానేమీ ఖాళీగా లేనని చెప్పారు. రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని అన్నారు. కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ దశలో మాత్రమే ఉందని.. ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు.
అంతకుముందు కామరెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో మాట్లాడేందుకు వచ్చిన డీఎస్పీపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలెక్టరేట్ లోకి వెళ్లకుండా బారికేడ్లు పెట్టినా రైతులు మాత్రం ఆగలేదు. బారికేడ్లను ఎత్తి పడేసి కలెక్టరేట్ లోకి వెళ్లేందుకు ప్రతనలుగురిని మాత్రమే అనుమతిస్తామని ఏఎస్పీ చెప్పడంతో అన్నదాతలు ఆగ్రహంతో రగిలిపోయారు. బారికేడ్లు తోసుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బారికేడ్లను ఎత్తి పడేసిన రైతులు పోలీసులను తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.