భిక్కనూరు,వెలుగు: భిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ జితేశ్వి పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఆలయాన్ని సందర్శించి, ఆలయంలో నిర్మిస్తున్న కోనేరు పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడికి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా మొక్కలు నాటాలని సూచించారు.
ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.2 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో అనంత్రావు, ఆలయాభివృద్ధి కమిటీ చైర్మన్ అందె మహేందర్రెడ్డి, అర్చకులు కొడకండ్ల రామగిరి శర్మ, ఈవో శ్రీధర్కుమార్తదితరులు పాల్గొన్నారు.