అశ్వాపురం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని భీముని గుండం కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్ట్ మొదటి దశ పంప్ హౌస్ ను కలెక్టర్ జితేశ్వి పాటిల్ శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం, ఆయకట్టు తదితర అంశాలను ఇరిగేషన్ అధికారులు కలెక్టర్కు వివరించారు.
ప్రమాదం పొంచి ఉన్న వద్ద కాల్వకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఈఈ తెల్ల వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాస్ రావు, ఏఈలు రాజీవ్ గాంధీ, నవీన్, ఎంపీపీ ముత్తినేని సుజాత తదితరులు పాల్గొన్నారు.