
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లాను పరిశుభ్ర జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్ పిలుపునిచ్చారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజీలో శనివారం నిర్వహించిన శ్రమదానంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలేజీలోని గ్రౌండ్లో క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. వాలీబాల్, హాకీ కోర్టులు, స్విమ్మింగ్‌పూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు అందరం కృషి చేయాలన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, జిల్లా యువజన క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి, డీపీవో చంద్రమౌళి, కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వనజ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో చలపతి పాల్గొన్నారు.