వరద బాధితులకు డ్రోన్ తో లైఫ్ జాకెట్లు

వరద బాధితులకు డ్రోన్ తో లైఫ్ జాకెట్లు

సుజాతనగర్, వెలుగు :  వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్లతో లైఫ్​ జాకెట్లు అందించేందుకు  కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో మంగళవారం   మాక్​ డ్రిల్​ నిర్వహించారు.  మండలంలోని సింగభూపాలెం చెరువులో పోలీస్, రెస్క్యూ, ఫైర్ సిబ్బంది వరదల సమయంలో వాగుల్లో, నదుల్లో ఈ డ్రిల్ చేపట్టారు.

 డ్రోన్ సహాయంతో లైఫ్ జాకెట్ లను, ట్యూబ్ లను బాధితులకు చేరవేసి వారిని కాపాడేందుకు కృషి చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.  కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రహమాన్, చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై జుబేదా బేగం సిబ్బంది పాల్గొన్నారు.