ఇందిరమ్మ ఇండ్లు నాణ్యతతో నిర్మించాలి : జితేశ్.వి. పాటిల్

 ఇందిరమ్మ ఇండ్లు నాణ్యతతో నిర్మించాలి : జితేశ్.వి. పాటిల్
  • కలెక్టర్​ జితేశ్.వి. పాటిల్

  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేయాలని కలెక్టర్​ జితేష్​ వి పాటిల్ అన్నారు. నేషనల్​ అకాడమీ ఆఫ్​ కన్​స్ట్రక్షన్స్​(న్యాక్​) ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల మేస్త్రీలకు సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన ట్రైనింగ్​ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు.  ఇండ్ల నిర్మాణాల్లో మేస్త్రీలదే కీలక పాత్ర అని అన్నారు. ఇంటి సామగ్రి వృథా కాకుండా సద్వినియోగం చేసుకునేలా మేస్త్రీలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పటిష్టంగా ఉండే విధంగా  నిర్మించాలన్నారు. . ప్రభుత్వం అందజేసే రూ. 5 లక్షలతో క్వాలిటీతో ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. 

మొదటి విడతలో బేస్​ మెంట్​ పూర్తి అయిన తర్వాత రూ. లక్ష, రెండో విడతలో గోడలు పూర్తి అయిన తర్వాత రూ. 1.25 లక్షలు, మూడో విడతలో స్లాబ్​ పూర్తి అయిన తర్వాత రూ.1.75లక్షలు నాలుగు విడతలో ఇల్లు పూర్తి అయిన తర్వాత మిగిలిన రూ. లక్ష సాంక్షన్​ అవుతాయన్నారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ శిక్షణను మేస్త్రీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేస్త్రీలకు టీ షర్ట్స్​ పంపిణీ చేశారు. ఈ ప్రోగ్రాంలో హౌసింగ్​ పీడీ శంకర్​, మెప్మా పీడీ రాజేశ్​, న్యాక్​ అధికారి హెప్సిబా, ఇన్స్ పెక్టర్​ కరుణాకర్​ పాల్గొన్నారు. 

ఈవీఎం గోదాంల తనిఖీ

కొత్తగూడెంలోని ఈవీఎంల గోదాంలను కలెక్టర్​తనిఖీ చేశారు.  ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈవీఎం గోదాంలను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. ఈవీఎంల భద్రతకు సంబంధించి ప్రతి నెలా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.  ఎన్నికల సూపరింటెండెంట్​ ధారా ప్రసాద్​, తహసీల్దార్​ పుల్లయ్య, ఎన్నికల మాస్టర్​ ట్రైనీ పూసపాటి సాయి కృష్ణ ఉన్నారు.