సంపదను పెంచే పరిశ్రమలు స్థాపించాలి

సంపదను పెంచే పరిశ్రమలు స్థాపించాలి
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్ ​వి పాటిల్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  సంపదను పెంచే పరిశ్రమలు స్థాపించేందుకు ఆఫీసర్లు కృషి చేయాలని కలెక్టర్​ జితేశ్ వి పాటిల్​ సూచించారు. పలు శాఖల ఆఫీసర్లతో గురువారం కలెక్టరేట్​ నుంచి వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు.  వ్యవసాయ భూముల్లో ఫాం​పాండ్​ నిర్మాణాలతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. జిల్లాలో దాదాపు 52వేల బోర్లు వ్యవసాయ భూముల్లోఉన్నాయని, 50వేల ఫాం పాండ్​లను నిర్మించేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫాం పాండ్​ నిర్మాణాల వల్ల చేపలు, అజోల్ల పెంపకం చేసుకోవచ్చన్నారు. మునగ సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు జీవనజ్యోతి, జీవన సురక్ష స్కీంలపై అవగాహన కల్పించాలన్నారు. 

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. గవర్నమెంట్​ ఆఫీస్​లు, స్కూల్స్​, హాస్పిటళ్లలో  ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఎక్కువ ఇంకుడు గుంతలు తవ్వే గ్రామాలకు ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రకటించారు. స్వచ్ఛ భారత్​లో సాంక్షన్​ అయిన మరుగుదొడ్ల నిర్మాణాలు వారం రోజుల్లోపు పూర్తి చేయాలన్నారు. సోమవారం లోపు తాగునీటికి అవసరమైన పైప్​లైన్ల వివరాలను అందజేయాలని ఆదేశించారు. జనవరి 2న సాంక్షన్​ అయిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్​ పనులు  త్వరగా చేపట్టాలన్నారు. ప్రతి మండల కార్యాలయంలో రాజీవ్​ యువ వికాసం హెల్ప్​ డెస్క్​లు ఏర్పాటు చేయాలని చెప్పారు.  ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​ విద్యాచందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సీపీఓ సంజీవరావు, హౌసింగ్​ పీడీ శంకర్​, మిషన్​ భగీరథ ఈఈ తిరుమలేశ్​ పాల్గొన్నారు.