రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ​జితేశ్​​

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ ​జితేశ్​​
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ​జితేశ్ వి పాటిల్​ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతపై బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించిన జిల్లా స్థాయి టాస్క్​ ఫోర్స్​ సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. యాక్సిడెంట్స్​ జరిగినప్పుడు తక్షణ చికిత్స అందించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ తరఫున ప్రణాళికలను రూపొందించాలని డీఎంహెచ్​ఓను ఆదేశించారు. 

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలకు దగ్గరగా ఉన్న హాస్పటల్స్​ను గుర్తించాలన్నారు. మున్సిపాలిటీల్లోని ప్రధాన కూడళ్లలో పార్కింగ్​ స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. ఈ మీటింగ్​లో జిల్లా రవాణాశాఖాధికారి వెంకటరమణ, ఆర్​అండ్​బీ ఈఈ వెంకటేశ్వరరావు, పంచాయతీ రాజ్​ ఈఈ శ్రీనివాసరావు, డీసీహెచ్​ఓ డాక్టర్​ రవిబాబుతో పాటు పలు శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.