గ్రీవెన్స్​కు టైంకు రారా .. ఆఫీసర్ల తీరుపై కలెక్టర్​ అసహనం

గ్రీవెన్స్​కు టైంకు రారా .. ఆఫీసర్ల తీరుపై కలెక్టర్​ అసహనం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా ఆఫీసర్ల తీరుపై కలెక్టర్​ జితేశ్​​ వి పాటిల్​తో పాటు అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరేట్​లో సోమవారం అడిషనల్​ కలెక్టర్లతో కలిసి కలెక్టర్​ గ్రీవెన్స్​ నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి అర్జీలు  తీసుకున్నారు. అధికారులు   గ్రీవెన్స్​కు కూడా ఇన్​టైంలో రాకపోతే ఎట్లా అంటూ అడిషనల్​ కలెక్టర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పీఎం ఇంటర్న్​షిప్​కు దరఖాస్తు చేసుకోవాలి

పీఎం ఇంటర్న్​ షిప్​ పథకానికి అర్హులైన స్టూడెంట్స్​   దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్​ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్న్​షిప్​కు సెలెక్ట్​ అయిన స్టూడెంట్స్​కు నెలకు రూ. 5వేల నుంచి రూ.6వేలు ఏడాది పాటు సాంక్షన్​ అవుతుందన్నారు. కుటుంబ ఆదాయం రూ. 8లక్షల లోపు ఉండాలని తెలిపారు.  ఆసక్తి గల వారు మార్చి 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు టోల్​ ఫ్రీ నెంబర్​ 1800116090 కు ఫోన్​ చేయాలని సూచించారు.