- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు ప్రాంతంలో రూ. 5కోట్లతో మహిళా శక్తి భవన్‌ను నిర్మించనున్నట్టు భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్జితేశ్ వి పాటిల్తెలిపారు. బిల్డింగ్‌కు అవసరమైన ల్యాండ్‌ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిల్డింగ్ విశాలంగా ఉండేలా నిర్మాణం చేపట్టాలని పీఆర్ ఇంజినీరింగ్ ఆఫీసర్లను ఆదేశించారు.
టీబీ నిర్మూలనే లక్ష్యంగా కృషి చేయాలి
టీబీ నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు. క్షయ వ్యాధిని నిర్మూలించే క్రమంలో ప్రత్యేక వెహికల్స్‌ను కలెక్టర్ ప్రారంభించారు. టీబీ అనుమానిత వ్యక్తులను గుర్తించడంతో పాటు వారికి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారన్నారు. ఈ ప్రోగ్రాంలో డీఎంహెచ్‌వో భాస్కర్ ణాయక్, హెల్త్ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ డాక్టర్ బాలాజీ, టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ సాయి కళ్యాణ్ పాల్గొన్నారు.
12న ఏకసభ్య కమిషన్ పర్యటన..
ఎస్సీ వర్గీకరణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్‌ఈనెల12న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నదని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లో ఎస్సీ వర్గీకరణకు అవసరమైన వివరాలను ఇవ్వాలని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కమిషన్ డాక్టర్ జస్టీస్ షమీమ్ అక్తర్ అర్జీలను తీసుకుంటారని తెలిపారు.