కామారెడ్డిటౌన్, వెలుగు: పోలింగ్సెంటర్లలో అన్ని రకాల సౌలతులు కల్పిస్తున్నామని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. గురువారం పోలింగ్ ఏర్పాట్లపై జహీరాబాద్ పార్లమెంట్ అబ్జర్వర్ గోపాల్‌జి తివారీ, వ్యయ పరిశీలకులు మోతిలాల్షెటే, సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూర్తో జరిగిన వీసీలో కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధూశర్మలు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. ఎండాకాలం దృష్ట్యా, పోలింగ్ సెంటర్లలో తాగునీటి సౌకర్యం, షామియానాతో పాటు వీల్ చైర్, కరెంట్, ఫస్ట్ ఎయిడ్ లాంటి సౌకర్యాలు సిద్ధం చేశామన్నారు. ఓటర్లకు ఎవరూ ప్రలోభపెట్టకుండా నిఘా పెంచామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. బార్డర్ చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచామని, నిరంతరం తనిఖీలు చేస్తున్నామన్నారు.