జలశక్తి అభియాన్​ను పక్కాగా అమలు చేయాలి : కలెక్టర్​  జితేశ్

జలశక్తి  అభియాన్​ను పక్కాగా అమలు చేయాలి :  కలెక్టర్​  జితేశ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జలశక్తి అభియాన్​ను పక్కాగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్​ జితేశ్ వి పాటిల్​ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్​లో పలు శాఖ అధికారులతో జలశక్తి అభియాన్ ​అమలుపై శనివారం నిర్వహించిన రివ్యూ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ‘వాన నీటిని ఒడిసి పట్టుకుందాం.. భూగర్భ జలాన్ని పెంపొందిద్దాం’ అనే నినాదంతో ప్రజల భాగస్వామ్యంతో ఆఫీసర్లు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

‘క్యాచ్​ ద రైన్​ వెన్​ ఇట్​ ఫాల్స్’ అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయాలన్నారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలపై ప్రజల్లో అవేర్​ నెస్​ తీసుకురావాలన్నారు. చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ చర్యలు, వాటర్​ షెడ్లు, అడవుల పెంపకం, వాటర్ ​మేనేజ్​మెంట్​చర్యలను ముమ్మరంగా చేపట్టాలన్నారు. మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా అటవీశాఖాధికారి కిష్టాగౌడ్​, జడ్పీ సీఈవో కె. చంద్రశేఖర్, అడిషనల్​కలెక్టర్​ విద్యాచందన, పలు శాఖల అధికారులు శ్రీనివాసరావు, ఎన్.రవి, బాబూరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. 


వదరలతో అలర్ట్​గా ఉండాలి 


గోదావరిలోకి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతున్న క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్​గా ఉండాలని కలెక్టర్​ సూచించారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టాలన్నారు.