డిసెంబర్ 7న  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితా : కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్​ 

  • భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల తుది జాబితాను ఈ నెల 7న లోపు సిద్ధం చేయాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్ ​వి పాటిల్​ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్​ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలన్నారు. ప్రతి దరఖాస్తుకు దరఖాస్తు దారుడి ఫొటో, ప్రస్తుతం నివాసం ఇంటి ఫొటో జతపర్చాలని చెప్పారు. 4 నాటికి రెవెన్యూ ఇన్​స్పెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్ధిదారుల దరఖాస్తులు పూర్తి చేయాలన్నారు.

5న లబ్ధిదారుల జాబితాను తహసీల్దార్​, పంచాయతీ  ఆఫీసుల్లోని నోటీస్​ బోర్డులో పెట్టాలని చెప్పారు. 6న లబ్ధిదారుల ఎంపికపై అభ్యంతరాలు స్వీకరించాలన్నారు.  రెండు రోజుల్లో సర్వే డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. సీఎం కప్​ క్రీడా పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్​లో డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ బృందం కలెక్టర్​ను కలిసింది. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​ జిల్లాలో వరదలు, వర్షాల టైంలో తీసుకుంటున్న చర్యలు, నష్టాలను పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు. అనంతరం అవినీతి వ్యతిరేక వారోత్సవాల పోస్టర్​ను కలెక్టర్​ ఆవిష్కరించారు.