
- జిల్లాలో1.84లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పక్కాగా చేపట్టేలా ఆఫీసర్లు ప్లాన్ చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పౌరసరఫరాల సంస్థ, డీఆర్డీఏ, అగ్రికల్చర్, సహకార, తూనికలు.. కొలతలు, ట్రాన్స్పోర్టు, మార్కెటింగ్శాఖల జిల్లా ఆఫీసర్లు, రైస్ మిల్లర్లతో గురువారం నిర్వహించిన మీటింగ్లో ఆఫీసర్లతో కలిసి మద్దతు ధర వివరాలతో కూడిన వాల్ పోస్టర్లను కలెక్టర్ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1,84,502 మెట్రిల్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందులో 99,729 మెట్రిల్ టన్నులు సన్న బియ్యమని తెలిపారు. జిల్లాలో 144 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు.
అగ్రికల్చర్ ఆఫీసర్లు చేసిన క్రాప్ బుకింగ్ ప్రకారంగా రైతులకు టోకెన్లు జారీ చేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ధాన్యం రాకుండా ఎనిమిది చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దిగుమతిలో జాప్యం చేయకుండా మిల్లర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
గన్నీ సంచులు తీసుకున్న రైతుల వివరాలను రిజిష్టర్లో నమోదు చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద సన్న వడ్లు, దొడ్డు వడ్లకు సంబంధించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ విద్యాచందన, పలు శాఖలకు చెందిన జిల్లా ఆఫీసర్లు త్రినాధ్, రుక్మిణి, కుర్షిద్, బాబూరావు, విజయ్ కుమార్, మనోహర్, నరేందర్ పాల్గొన్నారు.
రాజీవ్యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి
రాజీవ్యువ వికాసానికి అర్హులైన నిరుద్యోగులు ఏప్రిల్ 5 లోపు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. 21 ఏండ్ల నుంచి 55 ఏండ్ల వయసు వరకు గల వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ. 2లక్షల లోపు ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలని తెలిపారు.