సీఎస్​ఆర్​ నిధులు తప్పకుండా ఇవ్వాలి .. ఎమ్మెల్యేలతో కలెక్టర్​ సమావేశం

సీఎస్​ఆర్​ నిధులు తప్పకుండా ఇవ్వాలి .. ఎమ్మెల్యేలతో కలెక్టర్​ సమావేశం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు కార్పొరేట్​ సోషల​రెస్పాన్సిబిలిటీ(సీఎస్​ఆర్​) కింద 2 శాతం నిధులు ఇవ్వాలని పలువురు ఎమ్మెల్యేలు కోరారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, పరిశ్రమల ప్రతినిధులతో కలెక్టరేట్​లో బుధవారం సీఎస్​ఆర్​ ఫండ్స్​పై కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.  కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు తప్పని సరిగా 2శాతం నిధులను సీఎస్​ఆర్​ కింద ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

ఇక్కడి పరిశ్రమలు ఇచ్చే సీఎస్​ఆర్​ ఫండ్స్​ను ఈ జిల్లాలోనే ఖర్చు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. సీఎస్​ఆర్​ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కలెక్టర్​ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​, సింగరేణి, కేటీపీఎస్, ఐటీసీ, నవభారత్, బీటీపీఎస్​ సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు జీఎం ఇండస్ట్రీస్​ తిరుపతయ్య, సీపీవో సంజీవరావు పాల్గొన్నారు.