- సమ్మర్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి
- కలెక్టర్ జితేష్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బాలల రక్షణ కోసమే బాల రక్షా భవన్ ఏర్పాటు చేశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బాల రక్షా భవన్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆఫీస్‌కు అవసరమైన కంప్యూటర్లు, ఇతర సామగ్రి ఏర్పాటుకు నివేదికలు అందజేయాలన్నారు.
జిల్లా బాలల పరిరక్షణ విభాగం, బాలల సంక్షేమ సమితి, బాలల న్యాయ మండలి, ప్రత్యేక బాలల పోలీస్‌విభాగం, జాతీయ బాల కార్మిక నిర్మూలన పథకం, జిల్లా ప్రొబేషన్ఆఫీసర్, చైల్డ్ లైన్అన్నీ కలిపి ఒకే చోట అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రోగ్రాంలో పలు శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.
సమ్మర్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి..
సమ్మర్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఆఫీసర్లను కలెక్టర్ఆదేశించారు. నీటి ఎద్దడి లేకుండా ప్రణాళికలను రూపొందించాలన్నారు. తాగు నీటి సమస్యపై క్షేత్ర స్థాయిలో ఆఫీసర్లు పర్యటించి, సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. పైప్ లైన్రిపేర్లు చేపట్టాలన్నారు. గ్రామాల్లో తాగు నీటి ఎద్దడిపై టోల్‌ఫ్రీ నెంబర్ 180059 94007 ద్వారా సమాచారం ఇస్తే పరిష్కరిస్తారని తెలిపారు.