పాల్వంచలో సోషల్ వెల్ఫేర్ టీజీ సెట్ పరీక్షా కేంద్రం తనిఖీ : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

పాల్వంచలో సోషల్ వెల్ఫేర్ టీజీ సెట్ పరీక్షా కేంద్రం తనిఖీ : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

పాల్వంచ, వెలుగు: నవభారత్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో నిర్వహించిన టీజీ సెట్ పరీక్ష కేంద్రాన్ని ఆదివారం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశాలతోపాటు  6,7, 8, 9 తరగతులకు సంబంధించి బ్యాక్ లాగ్​ ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రానికి 460 మంది విద్యార్థులకు 444 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు.