
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికలు పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్వి పాటిల్సిబ్బందికి సూచించారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే పీవో, ఏపీవోలకు శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు.
ఎన్నికల ముందు రోజే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ పేపర్లు అన్ని సరి చేసుకోవాలని చెప్పారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
అర్ధరాత్రి వరకు షాప్లు ఓపెన్...
రంజాన్ పండుగ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు షాప్స్ఓపెన్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో పలు విభాగాల ఆఫీసర్లు, ముస్లీం మత పెద్దలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెల 2 నుంచి రంజాన్ మాసం సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
ప్రార్థనా సమయానికి అనుగుణంగా రెండు పూటలా తాగునీటిని సప్లై చేసేలా మిషన్ భగీరథ ఆఫీసర్లు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని మసీదులు, వాటి మత పెద్దల వివరాలను తెలుపాలని చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, డీపీవో చంద్రమౌళి, డీఎంహెచ్వో భాస్కర్ నాయక్, మున్సిపల్కమిషనర్లు పాల్గొన్నారు.