రామం భజే సీడీ ఆవిష్కరించిన కలెక్టర్

రామం భజే సీడీ ఆవిష్కరించిన కలెక్టర్

భద్రాచలం, వెలుగు : ఏఆర్​మ్యూజికల్స్ సంస్థ రూపొందించిన రామం భజే సీడీని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ శుక్రవారం ఆర్డీవో ఆఫీస్​లో ఆవిష్కరించారు. దేశ, విదేశాల నుంచి రామయ్య దర్శనం కోసం వచ్చే భక్తజనానికి వీనుల విందైన సంగీతంతో పాటు, మైమరిపించే గానామృతాన్ని అందిస్తున్న రామం భజే అద్భుతంగా ఉందని కలెక్టర్ ప్రశంసించారు.

ఎన్నిసార్లు విన్నా తనివి తీరనిది రామాయణం అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన ఏఆర్ మ్యూజిక్​ అధ్యక్షుడు శ్రీరామ్, రమేశ్, హరినాథ్, సభ్యులు రచయిత మూర్తి, గాయని అరుణరామ్, సంగీత దర్శకులు దేవీ ప్రేమ్​ తదితరులను కలెక్టర్ మెచ్చుకున్నారు.