పిల్లల్లో పోషణ లోపం లేకుండా చూడాలి : కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్​​ 

పిల్లల్లో పోషణ లోపం లేకుండా చూడాలి :  కలెక్టర్ ​జితేశ్​వి పాటిల్​​ 
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​జితేశ్​వి పాటిల్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పిల్లల్లో పోషణ లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో అనుబంధ పోషకాహార కార్యక్రమంపై నిర్వహించిన ఒక్కరోజు ట్రైనింగ్​ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడారు.  పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి వైద్యశాఖ కో ఆర్డినేషన్​తో మెరుగైన సేవలందించాలన్నారు. ప్రతినెలా మొదటివారంలో అంగన్​వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లల ఎత్తు, బరువు తప్పనిసరిగా చూడాలని ఆదేశించారు. గర్భణులు అనీమియా బారిన పడకుండా పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​, జిల్లా సంక్షేమ అధికారి వేల్పుల విజేత, డీఐవో బాలాజీ, మెడికల్​ ఆఫీసర్లు, సీడీపీవోలు, సూపర్​వైజర్లు పాల్గొన్నారు.  

నాణ్యమైన భోజనం పెట్టాలి..

హాస్టళ్లలోని  స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్​ అధికారులను ఆదేశించారు. కొత్తగూడెం పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్​ను ఆయన సందర్శించారు. భోజనం, సౌకర్యాల గురించి స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు. భోజనం విషయంలో క్వాలిటీ లేకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

వ్యర్థాలతో వస్తువుల తయారీపై పోటీలు

వ్యర్థ పదార్థాలతో కళాత్మక వస్తువుల తయారీపై స్టూడెంట్స్​కు పోటీలు నిర్వహించాలని కలెక్టర్​జితేశ్​​ వి పాటిల్​ విద్యాశాఖాధికారులకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యర్థాలతో ఉపయోగపడే ఒక కళాత్మక వస్తువును తయారు చేసి జిల్లా స్థాయిలో ప్రదర్శన చేసే విధంగా వేస్ట్​తో ఆర్ట్​ పోటీలను నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్​ హైస్కూళ్లతో పాటు ఇంటర్​ కాలేజీల స్టూడెంట్స్​ ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని తెలిపారు. ఉదయం 10గంటలకు పోటీలు మొదలవుతాయని, ప్రతిభ కనపర్చిన వారికి ఫస్ట్​, సెకండ్, థర్డ్​ బహుమతులుంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థుల వివరాలను 28లోపు స్కూళ్ల హెచ్​ఎంలు అందజేయాలని తెలిపారు.