పోడు భూములకు కరెంట్​ ఇవ్వాలి : జితేశ్​ వి.పాటిల్​​

పోడు భూములకు కరెంట్​ ఇవ్వాలి : జితేశ్​ వి.పాటిల్​​
  • కలెక్టర్​ జితేశ్​ వి.పాటిల్​​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోడు వ్యవసాయానికి కరెంట్ సౌకర్యం కల్పించేందుకు విద్యుత్​శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్​జితేశ్​వి.పాటిల్​ఆదేశించారు.  పలు శాఖల ఆఫీసర్లతో మంగళవారం కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు.  పోడు భూముల్లో ఆయిల్ ఫాం సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. అటవీ శాఖ పరిధిలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులను గుర్తించి, త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలో బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకునే రైతుల వివరాలు ఇవ్వాలన్నారు.  

వ్యవసాయ భూముల్లో, ఇళ్ల ఎదుట ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా జీపీ సెక్రటరీలు కృషి చేయాలని సూచించారు.  అన్ని నర్సరీల్లో  ఇప్ప, కరక్కాయ, చింత, విషముష్టి, కుంకుడు, తంగేడు వంటి మొక్కలు పెంచాలన్నారు. విత్తనాలు సేకరించే పాఠశాల విద్యార్థులకు జిల్లా స్థాయిలో రూ.50 వేలు, మండల స్థాయిలో రూ. 5 వేలు, గ్రామ స్థాయిలో రూ. 1,000 నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు తెలిపారు.  ఎల్ఆర్ఎస్​, ధరణి పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని పేర్కొన్నారు.  అడిషనల్​కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, అడిషనల్​డీఆర్డీవో రవి, పీఆర్​ఈఈ శ్రీనివాసరావు, డీఈవో వెంకటేశ్వరాచారి, మిషన్​భగీరథ ఈఈ నళిని తదితరులు పాల్గొన్నారు.