ఇందిరమ్మ’ మోడల్ హౌస్​ నిర్మాణాలకు ల్యాండ్​ గుర్తించాలి :  కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ 

  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇందిరమ్మ మోడల్ ​హౌస్​ నిర్మాణాల కోసం ల్యాండ్​ గుర్తించాలని కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలను కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ల్యాండ్​ గుర్తించడంతో పాటు మోడల్​ హౌస్​ నిర్మాణాలను త్వరగా చేపట్టేలా ఆఫీసర్లు చర్యలు చేపట్టాలన్నారు.

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మొబైల్​ యాప్​ ద్వారా సర్వే పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు దారులు ఒకచోట నివసిస్తూ వారికి వేరే చోట స్థలం ఉంటే ఆ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని చెప్పారు. ఎక్కువ దరఖాస్తులున్న ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని కేటాయించాలని ఆదేశించారు. 

‘గ్రూప్​2’కు ఏర్పాట్లు చేయాలి  

ఈ నెల 15,16న  నిర్వహించే గ్రూప్ 2 ఎగ్జామ్​కు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ ఆఫీసర్లను ఆదేశించారు. జిల్లాలో 38 సెంటర్లలో 13,465 మంది ఎగ్జామ్​కు అటెండ్​ కానున్నారని తెలిపారు. 40శాతం డైట్​ చార్జీలను పెంచిన క్రమంలో స్టూడెంట్స్​కు క్వాలిటీ  ఫుడ్​ అందించాలన్నారు.