
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కరెంట్ సప్లై, తాగునీటి సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో బుధవారం కలెక్టర్టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయలేకపోతున్నామన్నారు. తాగునీటి అవసరాలకు సరిపడా వాటర్ అందుబాటులో ఉందని, సప్లైలో ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. పంటలకు సాగు నీరు అందేలా ఇరిగేషన్ ఆఫీసర్లు తహసీల్దార్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైతు భరోసా ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు అందించాలన్నారు. నిరంతరం కరెంట్ సప్లై ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యతోనే మంచి భవిష్యత్
విద్యతోనే మంచి భవిష్యత్లభిస్తుందని కలెక్టర్విద్యార్థులకు సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ను ఆయన సందర్శించారు. స్టూడెంట్స్ టెన్త్ క్లాస్లో మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని టీచర్లు సూచించారు. సైన్స్ ల్యాబ్, రేకుల షెడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి అందజేయాలని ఆదేశించారు.
క్రీడలతో మానసికోల్లాసం
అశ్వారావుపేట : క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీర దృఢత్వానికి దోహదపడతాయని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ అన్నారు. బుధవారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బోధన సిబ్బంది జోనల్ క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోధన సిబ్బంది వయసుతో సంబంధం లేకుండా ఉత్సాహంగా క్రీడా పోటీలలో పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు సాగు చేస్తున్న మునగ పంటను పరిశీలించారు.