
పాల్వంచ, వెలుగు : పిల్లలకు పాఠశాలల్లోఅందిస్తున్న మధ్యాహ్న భోజనం క్వాలిటీగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్వి పాటిల్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత పాల్వంచ ప్రభుత్వ పాఠశాలలో కిచెన్‌ను తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు ప్రభుత్వ మెనూ ప్రకారం భోజనం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కిచెన్ షెడ్, బల్లలు, ఐరన్ పొయ్యిలు, విద్యార్థులకు ప్రత్యేకంగా లంచ్ బాక్స్ తో కూడిన బ్యాగ్ ను ఏర్పాటు చేసేందుకు నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇండ్ల జాబితాలో అనర్హులకు చోటు కల్పించొద్దు
భద్రాద్రికొత్తగూడెం : ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అనర్హులకు చోటు ఉండొద్దని కలెక్టర్ జితేశ్ఆఫీసర్లకు సూచించారు. కలెక్టరేట్ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో శుక్రవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల జాబితాలో తండ్రి పేరు వచ్చి పెండ్లి అయిన కొడుకు దరఖాస్తు చేసి ఉంటే దానిని పరిశీలించి పరిగణలోకి తీసుకోవాలన్నారు.
‘జల్ సంచయ్ జన్ భగీచారి’ అమలులో భాగంగా జిల్లాలో 2024 ఏప్రిల్ నుంచి చేపట్టిన ఇంకుడు గుంతల వివరాలను ఆన్లైన్ చేయాలని చెప్పారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.