భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని గవర్నమెంట్ ఐటీఐకి అవసరమైన కంప్యూటర్స్‌ను అందజేస్తామని కలెక్టర్జితేశ్ వి పాటిల్ తెలిపారు. ఐటీఐని కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఐటీఐకి కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్స్‌తో మాట్లాడారు. స్టూడెంట్స్‌కు అవసరమైన బుక్స్ కొరత లేకుండా చూడాలన్నారు. ప్రాక్టికల్స్‌కు అవసరమైన మెటీరియల్స్, ఫర్నీచర్స్‌ను దశల వారీగా అందజేస్తామన్నారు. కాంపౌండ్ వాల్ పెంచడంతో పాటు ఇనుపకంచె వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
ల్యాబ్స్, క్లాస్ రూమ్స్‌తో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఖాళీగా ఉన్న టెక్నికల్ స్టాఫ్, ఆఫీస్ సబార్డినేట్స్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. ఐటీఐ టాటా టెక్నాలజీ సంస్థతో టై అప్ అయి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌కు సెలక్ట్ అయిందన్నారు. ఇందుకు సంబంధించి బిల్డింగ్ కట్టేందుకు అవసరమైన ల్యాండ్‌ను పరిశీలించారు. ఈ ప్రోగ్రాంలో ఐటీఐ ప్రిన్సిపాల్ జి. రమేశ్ పాల్గొన్నారు.