కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి వడ్ల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తెలిపారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 4.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు.
326 వడ్ల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కోతలు షూరు అయిన ఏరియాల్లో సెంటర్లను 1వ తేదీ నుంచి ప్రారంభిస్తామన్నారు. సెంటర్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లకు కలెక్టర్ ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సౌకర్యం, నీడ వసతి కల్పించనున్నారు. టార్పాలిన్లు, వెయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం మిషన్లను అందుబాటులో ఉంచనున్నారు.