భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలను పెంచాల్సిన బాధ్యత టీచర్స్దేనని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, హైస్కూల్స్ హెచ్ఎంలతో గురువారం నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులలో వంద శాతం సామర్థ్యాలు పెంపొందించేందుకు టీచర్స్ సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పనులను స్పీడ్‌గా చేస్తున్నామన్నారు. స్కూళ్లలో ఔషధ మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో స్టూడెంట్స్‌కు ఇంటి వద్ద రాత పనిని ప్రోత్సహించేందుకు నోట్ బుక్స్ అందిస్తున్నామని చెప్పారు. మ్యాథ్స్‌లో స్టూడెంట్స్‌ను అద్బుతంగా తీర్చి దిద్దేందుకు కృషి చేయాలని టీచర్లకు సూచించారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో ఎం. వెంకటేశ్వరాచారి, ఎగ్జామ్స్ అసిస్టెంట్ కమిషనర్ మాధవరావు, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఎ. నాగరాజశేఖర్, సైన్స్ ఆఫీసర్ చలపతి రాజు పాల్గొన్నారు.