ట్రైబల్​ మ్యూజియాన్ని అభివృద్ధి చేస్తాం : కలెక్టర్ జితేశ్​ వి.పాటిల్​

ట్రైబల్​ మ్యూజియాన్ని అభివృద్ధి చేస్తాం : కలెక్టర్ జితేశ్​ వి.పాటిల్​

భద్రాచలం, వెలుగు : భద్రాచలం మన్యంలో ట్రైబల్ మ్యూజియాన్ని డెవలప్ చేస్తామని కలెక్టర్ జితేశ్​​వి.పాటిల్​తెలిపారు. గురువారం దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్ప, నారాయణరావుపేట గ్రామాలను ఆయన సందర్శించారు. గిరిజన గ్రామాల్లో ట్రైబల్​ కల్చర్​కు సంబంధించిన నివాస గృహాలు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి భద్రాచలం, పర్ణశాల దేవాలయాలకు వచ్చే రామభక్తులు ట్రైబల్​ మ్యూజియంతోపాటు పరిసర గ్రామాల్లో బస చేసేలా టూరిజంను డెవలప్ చేస్తామన్నారు.

రాత్రి వేళల్లో టూరిస్టులు గిరిజన గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వారి వంటలు, వస్తువులను చూసి ఎంజాయ్​ చేసేలా ఏర్పాట్లు ఉండాలన్నారు. టూరిస్టులను సంప్రదాయబద్దంగా ఆహ్వానించడం, వెదురుతో హట్స్, ఇతర వస్తువులు తయారు చేయాలని సూచించారు. కుర్చీలు, మంచెలు, పల్లె సంప్రదాయాలు కళ్లకుకట్టినట్లుగా పరిసరాలను తీర్చిదిద్దాలని చెప్పారు.

అంతకుముందు భద్రాచలంలో సరస్వతీ శిశుమందిర్, డబుల్ బెడ్ రూం ఇండ్లను కలెక్టర్ సందర్శించారు. ఆయన వెంట దుమ్ముగూడెం తహసీల్దార్ అశోక్​, ఐదు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రటరీలు, ట్రైబల్ మ్యూజియం ఇన్​చార్జి వీరస్వామి తదితరులు ఉన్నారు.