క్రీడలతో క్రమశిక్షణ వస్తుంది : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

క్రీడలతో క్రమశిక్షణ వస్తుంది : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్

పాల్వంచ, వెలుగు : విద్యార్థి దశ నుంచే పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి ఉంటే వారిలో తప్పకుండా క్రమ శిక్షణ ఉంటుందని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్​ వి పాటిల్ అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీనివాస కాలనీ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని చంద్రుగొండ మండలంలోని పెద్దపాడు ట్రాకింగ్ స్పాట్, పాల్వంచ శ్రీనివాస కాలనీ క్రీడా మైదానాలు ప్రకృతి రమణీయత నడుమ ఉన్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ ప్రాంతాలకు తీసుకువెళ్లి క్రీడల్లో సాధన చేయిస్తే భవిష్యత్​ బాగుంటుందని చెప్పారు. 

క్రీడాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా పాల్వంచలోని బృందా వన కాలనీ ప్రజల సమస్యలు పరిష్కరించాలని కొత్వాల శ్రీనివా సరావు కలెక్టర్ ను కోరారు. టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి పరంధామరెడ్డి, ఏసీపీ విజయబాబు, మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎం హెచ్ వో సుకృత, చీఫ్ కోచ్ అన్నం వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, భద్రాచలం, కొత్తగూడెం, నవభారత్, ఇల్లెందు ప్రాంతాల క్రీడాకారులు 

పాల్గొన్నా రు.