ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

పిట్లం, వెలుగు: సమాజాభివృద్ధిలో టీచర్ల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం రెడ్​క్రాస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టీచర్స్​డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా హాజరై మాట్లాడారు. టీచర్స్​లేని సమాజాన్ని ఊహించుకోలేమన్నారు. సమాజంలో ఏది జరగాలన్నా తరగతి గది నుంచే ప్రారంభం అవుతుందన్నారు. ప్రభుత్వం త్వరలో ‘తొలిమెట్టు’ కార్యక్రమం ప్రారంభించబోతుందని, ఇందులో వెనుకబడిన స్టూడెంట్లను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నాణ్యమైన విద్యను అందించనున్నట్లు చెప్పారు. ఇందులో టీచర్లు ప్రధాన పాత్ర పోషించాలన్నారు.

టీచర్లను సన్మానించుకునేందుకు ఈ ప్రోగ్రామ్‌‌‌‌ నిర్వహించిన రెడ్​క్రాస్ స్టేట్ కమిటీ మెంబర్ సంజీవరెడ్డి, జిల్లా ప్రెసిడెంట్​రాజన్నను అభినందించారు. ముందుగా జిల్లాలోని 22 మండలాల్లోని 46 మంది టీచర్లనుకలెక్టర్, రెడ్​క్రాస్​ సంస్థ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్, డీఈవో రాజు, పిట్లం, పెద్దకొడప్​గల్ ఎంపీపీలు కవిత, ప్రతాప్‌‌‌‌రెడ్డి, జడ్పీటీసీ మెంబర్ శ్రీనివాస్‌‌‌‌రెడ్డి, రెడ్​క్రాస్ స్టేట్​కమిటీ మెంబర్​ సంజీవరెడ్డి, బాన్సువాడ డివిజన్​ప్రెసిడెంట్ వేణుగోపాల్, జిల్లా రెడ్​క్రాస్ వైస్ ప్రెసిడెంట్ నాగరాజుగౌడ్, సెక్రటరీ రఘుకుమార్, ట్రెజరర్ దస్తీరాం పాల్గొన్నారు.

‘బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పిన్రు’ 

భిక్కనూరు, వెలుగ: బలవంతంగా కాంగ్రెస్​పార్టీ కండువాలు కప్పారని ఇసాన్నపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ లీడర్లు చెప్పారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ తాము వినాయకచవితి చందాల కోసం గురువారం మెదక్ జిల్లా రామయంపేటకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌ తిర్మల్ స్వామి చందాలు ఇప్పిస్తానని చెప్పి మాజీ మంత్రి షబ్బీర్​ఆలీ ఫామ్​హౌస్‌‌‌‌కు తీసుకెళ్లి తమకు బలవంతంగా కండువాలు కప్పారని తెలిపారు. తాము ఎప్పుడైనా టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని చెప్పారు. సమావేశంలో  మ్యాకల రాములు, సుధాకర్, స్వామి, బల్లం రవి పాల్గొన్నారు. 

రూ.1.55 లక్షలు పలికిన గణపతి లడ్డూ

పిట్లం, వెలుగు: పిట్లంలో గణపతి లడ్డు ప్రసాదం వేలం పాట రికార్డు స్థాయిలో పలికింది. గురువారం పిట్లం ముకుందరెడ్డి కాలనీలో నిర్వహించిన లడ్డు ప్రసాద వేలంలో కంబాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన కారేగాం సొసైటీ వైస్ చైర్మన్‌‌‌‌ పంపాటి సంగప్ప రూ.1.55 లక్షలకు పాడి కైవసం చేసుకున్నారు. పిట్లం ఆర్యవైశ్య గణేశ్‌‌‌‌ మండలి వద్ద నిర్వహించిన మరో వేలంలో పిట్లంకు చెందిన ఉప్పు అశోక్ ఫ్యామిలీ రూ.1.08 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 

సివిల్స్‌‌‌‌కు ఉచిత కోచింగ్

నిజామాబాద్ టౌన్, వెలుగు: వెనుకబడిన తరగతుల విద్యార్థులకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో  సివిల్స్‌‌‌‌కు ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి డి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్‌‌‌‌‌‌‌‌లో  200 మంది, హనుమకొండలో 100 మందికి ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌‌‌లైన్ ద్వారా ఈనెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈనెల 25న దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌‌‌‌లైన్ స్క్రీన్ టెస్ట్ నిర్వహిస్తామన్నారు. 29 నుంచి ఉచిత శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు నగరంలోని బీసీ స్టడీ సర్కిల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో 
సంప్రదించాలన్నారు.

బీజేపీ ఆఫీసుకు భూమి పూజ

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆఫీస్‌‌ నిర్మాణానికి గురువారం భూమి పూజ చేశారు.  పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌‌చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి, జిల్లా జనరల్​సెక్రటరీ తేలు శ్రీనివాస్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ పాల్గొన్నారు.  

13న పెన్షన్ అదాలత్

నిజామాబాద్ టౌన్, వెలుగు: ఉద్యోగుల పెన్షన్ స్కీం, పెన్షనర్ల సమస్యలపై ఈ నెల 13న పెన్షన్ అదాలత్‌‌ నిర్వహిస్తున్నట్లు రీజినల్ పీఎఫ్ కమిషనర్ హనుమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి 11.40 గంటల వరకు పీఎఫ్‌‌కు సంబంధించిన ఫిర్యాదులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వెబ్‌‌ సైట్ మీటింగ్‌‌లో పీఎఫ్ నంబర్‌‌‌‌ ఎంటర్ చేసి వీడియో కాన్ఫరెన్స్‌‌లో పాల్గొనాలని ఆయన సూచించారు.

కాళోజీ యాదిలో...

ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు ఉమ్మడి నిజామాబాద్‌‌ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, వివిధ పార్టీ ఆఫీసులు, పలు సంఘాలు కాళోజీ విగ్రహాలు, ఫొటోలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్‌‌లో జరిగిన వేడుకల్లో బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్‌‌పాల్‌‌ సూర్యనారాయణ మాట్లాడుతూ కాళోజీ తన అక్షరాన్ని ఆయుధంగా మలిచి  నిరంకుశ నిజాం పాలనకు చరమగీతం పాడిన మహానాయకుడని కొనియాడారు. కామారెడ్డి కలెక్టరేట్‌‌లో అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్ నివాళులర్పించారు. కోటగిరిలో మండలం పొతంగల్ హైస్కూల్‌‌లో యూత్‌‌ ఫర్ సేవా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో  విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్ పంపిణీ చేశారు. సిరికొండ హైస్కూల్, సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ, కిడ్స్ పార్క్ స్కూల్‌‌లో కాళోజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బోధన్ మున్సిపల్ ఆఫీసులో జరిగిన వేడుకల్లో చైర్‌‌‌‌పర్సన్‌‌ తూము పద్మావతి, మున్సిపల్ కమిషనర్​ రామలింగం, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆర్మూర్‌‌‌‌ తహసీల్దార్‌‌‌‌, మున్సిపల్‌‌ ఆఫీసుల్లో కూడా జయంతి వేడకలు నిర్వహించారు. 

- వెలుగు, నెట్‌‌వర్క్‌‌

బస్టాండ్‌‌‌‌ రీపేర్‌‌‌‌‌‌‌‌ కోసం ఎమ్మెల్యేకు వినతి

లింగంపేట, వెలుగు: నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ రీపేర్‌‌‌‌‌‌‌‌ కోసం నిధులు మంజూరు చేయాలని జడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్‌‌‌‌‌‌‌‌రెడ్డి శుక్రవారం కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే జాజాల సురేందర్‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్ల కింద నాగిరెడ్డిపేటలో హైదరాబాద్, మెదక్, బోధన్ ప్రధాన రోడ్డు పక్కన రెండు ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్‌‌‌‌ను నిర్మించారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి  మరమ్మతులు చేపట్టడం లేదన్నారు. బస్టాండ్ పైకప్పు పెచ్చులూడుతున్నాయని, మరుగుదొడ్లు వినియోగంలో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని 
మనోహర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చెప్పారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫొటోకు వినతి

భిక్కనూరు/పిట్లం, వెలుగు: వీఆర్‌‌‌‌‌‌‌‌ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫొటోకు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న ప్రతి వీఆర్ఏకు పే స్కేల్‌‌‌‌తో పాటు 55 ఏళ్లు నిండిన వారికి ఉద్యోగ విరమణ ఇప్పించి పెన్షన్‌‌‌‌ ఇస్తామని, వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి నేటికి రెండేళ్లు పూర్తయినట్లు చెప్పారు. ఇప్పటికైన సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. పిట్లం దీక్ష శిబిరంలో కూడా సీఎం ఫొటోకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. 47 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై సరికాదన్నారు. 

ఉమెన్స్ సెల్ అసిస్టెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా రమాదేవి

భిక్కనూరు, వెలుగు:  తెలంగాణ సౌత్ క్యాంపస్‌‌‌‌లో కాంట్రాక్ట్ లెక్చరర్‌‌‌‌‌‌‌‌గా పని చేస్తున్న డాక్టర్​ఎం.రమాదేవి దక్షిణ ప్రాంగణ ఉమెన్స్‌‌‌‌ సెల్ అసిస్టెంట్‌‌‌‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు  శుక్రవారం టీయూ వీసీ రవీందర్‌‌‌‌‌‌‌‌గుప్తా ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో లెక్చరర్లు డాక్టర్ ​యాలాద్రి, నారయణ పాల్గొన్నారు. 

పిడుగు పాటుతో 20 మేకలు మృతి

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోతాయిపల్లి శివారులోని బండకుంట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం పిడుగు పడి 20 మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన ఎర్రం నడిపొల్ల రాములు బండకుంట ప్రాంతంలో మేకలు మేపుతుండగా  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో మేకల మందపై పిడుగు పడడంతో 20 మేకలు అక్కడికక్కడే చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు.

టీయూ పీఆర్వో మార్పు

డిచ్‌‌‌‌పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ల మధ్య ఉన్న విభేదాలు తార స్థాయికి చేరాయి. టీయూ పీఆర్వోగా ఉన్న మహిళ ప్రొఫెసర్​ త్రివేణిని తొలగించి ఆమె స్థానంలో జమీల్ అహ్మద్‌‌‌‌ను  నియమించారు. గురువారం మాజీ రిజిస్ట్రార్ శివశంకర్‌‌‌‌‌‌‌‌ గౌడ్ సన్మాన కార్యక్రమానికి హాజరైన త్రివేణిని వీసీ తన ఛాంబర్‌‌‌‌‌‌‌‌లో తిట్టిన విషయం తెలిసిందే. పీఆర్వోగా నచ్చిన వారిని నియమించుకునే అధికారం వీసీ, రిజిస్ట్రార్లకు ఉన్నప్పటికీ ఈ ఘటన కారణంగానే ఆమెని మార్చినట్లు తెలుస్తోంది. అపాయింట్‌‌‌‌మెంట్‌‌‌‌ లెటర్​ అందుకునేందుకు జమీల్​అహ్మద్​ అందుబాటులో లేనప్పటికీ మార్పు చేయడం గమనార్హం.  

రుణమాఫీ అమలు ఎప్పుడు?

నవీపేట్‌‌‌‌, వెలుగు: రుణ మాఫీ ఎప్పుడు అమలు చేస్తారని నాగేపూర్‌‌‌‌‌‌‌‌ సొసైటీ రైతులు ప్రశ్నించారు. శుక్రవారం ఫకీరాబాద్‌‌‌‌లో చైర్మన్ శైలేశ్‌‌‌‌కుమార్ అధ్యక్షతన జరిగిన సొసైటీ మహాజన సభలో రైతులు నిలదీశారు. తెలంగాణ గవర్నమెంట్ రుణ మాఫీ అమలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. 2020లో రూ.25 వేల లోపు లోన్ తీసుకున్న 800 రైతులకుగాను 212 మందికే మాఫీ వచ్చిందన్నారు. ఇంకా మిగతా రైతులకు గవర్నమెంట్ ఎప్పుడు మాఫీ చేస్తుందన్నారు. గత పాలకవర్గంలో తీసుకున్న లోన్స్‌‌‌‌లో గోల్ మాల్‌‌‌‌పై ఎంక్వైరీ చేయించాలని సభ్యులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  డైరెక్టర్లు బెగారి సాయిలు, ధర్మజీ, రవి, శ్రీనివాస్, సెక్రటరీ రమేశ్‌‌‌‌, సిబ్బంది శేఖర్, సాయిరాం పాల్గొన్నారు.  

గణపయ్యా.. వెళ్లి రావయ్యా!

వైభవంగా వినాయక నిమజ్జనం
2,600 మంది పోలీసులతో భారీ బందోబస్తు 
‘గణపతి బప్పా.. మోరియా..! జై బోలో గణేశ్‌‌ మహరాజ్‌‌ కీ జై..’ అనే నినాదాలతో ఊరూవాడా హోరెత్తింది. 
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణపతి నిమజ్జన వేడుకలు శుక్రవారం వైభవంగా ముగిశాయి. నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, నవీపేట, భీంగల్‌‌‌‌ మున్సిపాలిటీలతో పాటు ఆయా మండలాల్లో నిర్వహించిన వినాయక శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దుబ్బ ప్రాంతంలో సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభమైన యాత్ర గుర్బాబాది రోడ్ , గోశాల నుంచి గాంధీగంజ్ నుంచి గాంధీచౌక్, పవన్ టాకీస్, అహ్మదీ బజార్ ఖిల్లా గాజులపేట్, పెద్దబజార్ మీదు వినాయక్‌‌‌‌ నగర్ నుంచి వినాయకుల బావి వరకు  కొనసాగింది. శోభాయాత్రలో కలెక్టర్ సి.నారాయణరెడ్డి, జిల్లా ఆఫీసర్లు, బిజేపీ నాయకులు, సంఘ పరివార్, సర్వసమాజ్ కమిటీ సభ్యులు, నగర కార్పొరేటర్లు పాల్గొన్నారు.  

– వెలుగు, నిజామాబాద్‌‌‌‌