వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​​

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి : కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని కలెక్టర్​జితేశ్​వి పాటిల్​ పిలుపునిచ్చారు. కొత్తగూడెం క్లబ్​లో జిల్లా స్థాయి యువజనోత్సవాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా యువత ముందుకు సాగితే తాము ఎంచుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చాన్నారు. 

స్టూడెంట్స్​ ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రోగ్రాంలో డీఆర్​డీవో విద్యాచందన, జిల్లా క్రీడా యువజన శాఖాధికారి పరంధామరెడ్డి, జిల్లా సైన్స్​ ఫెయిర్​ ఆఫీసర్​ చలపతి రావు, ఇంటర్మీడియట్​నోడల్​ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, మైనింగ్​ కాలేజ్​ప్రిన్సిపాల్​జగన్మోహన్​ రాజు పాల్గొన్నారు. 

రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టాలి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్​ సూచించారు. కలెక్టరేట్​లో రోడ్డు భద్రతపై నిర్వహించిన జిల్లా స్థాయిలో అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలతో ఎవరూ ప్రాణాలు పోగొట్టుకోవద్దని, గాయాలపాలు కూడా కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎస్పీ రోహిత్​ రాజు మాట్లాడుతూ పోలీస్ కళా బృందాలతో రోడ్డు ప్రమాదాలపై ప్రచారం నిర్వహిచనున్నట్టు తెలిపారు. 

పారిశుధ్య కార్మికులు జాగ్రత్తగా ఉండాలి 

పాల్వంచ : పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించే పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ సూచించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. విధి నిర్వహ ణలో అంకితభావం ప్రదర్శించిన ఐదుగురు పారిశుధ్య కార్మికులను కలెక్టర్ శాలువాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. 

అంకితభావంతో పని చేయాలి 

వైద్యులు విధి నిర్వహణలో అంకిత భవాన్ని ప్రదర్శిం చాలని కలెక్టర్ సూచించారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఆయన సందర్శించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని వైద్యాధికారి రాంప్రసాద్ ను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వై ద్యాధి కారి భాస్కర్ నాయక్, ఆస్పత్రుల సమన్వయ అధికారి రవిబాబు ఉన్నారు.