
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) కమిటీ మీటింగ్ గురువారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు ఈ మీటింగ్ జరుగుతుందని తెలిపారు. కో చైర్మన్గా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ వ్యవహరించనున్నారన్నారు.
జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు దిశ కమిటీ మెంబర్స్, అన్ని శాఖల జిల్లా అధికారులు మీటింగ్లో పాల్గొననున్నారని పేర్కొన్నారు. జిల్లా ఆఫీసర్లంతా మీటింగ్కు తమ శాఖలలో చేపడుతున్న అభివృద్ధి పనులతో, పూర్తిస్థాయి నివేదికలతో అటెండ్ కావాలన్నారు. ప్రతి మూడు నెలలకోసారి జరిగే దిశ మీటింగ్ కోసం ప్రజాప్రతినిధులు రోజంతా కేటాయిస్తే జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.