- రాష్ట్రస్థాయికి 27 మంది స్టూడెంట్స్ ఎంపిక
- ముగిసిన జిల్లా స్థాయి సైన్స్ పెయిర్
- ఎస్పీ, ఇల్లెందు ఎమ్మెల్యేలు హాజరు
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : వ్యవసాయ రంగాన్ని గ్రామాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రతీ స్టూడెంట్ ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ గా ఎదగాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. అన్నపురెడ్డిపల్లి లోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో మూడు రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్ స్పైర్ మనక్ సక్సెస్ అయ్యాయి. బుధవారం ముగింపు కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు.
రాష్ట్రస్థాయి లో ఎంపికైన 27 మంది ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ని తిలకించి స్టూడెంట్స్ ని అభినందించారు. జిల్లా నలుమూలలనుంచి 800 మంది స్టూడెంట్స్ రావడం గ్రేట్ అన్నారు. సైన్స్ పెయిర్ లో ప్రదర్శించిన ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ప్రదర్శనలకే పరిమితం కాకుండా గ్రామాల్లో రైతులు అమలు చేసేలా స్టూడెంట్స్, టీచర్లు కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి లో ఎంపికైన స్టూడెంట్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వరాచారి, డీఎస్వో చలపతి రాజు, ప్రిన్స్ పాల్స్ బురాన్, రాధాకృష్ణ మూర్తి, ఎంఈవో ఆనంద్ కుమార్, తహసీల్దారు జగదీశ్వర ప్రసాద్, ఎంపీడీవో మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.