భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : స్టూడెంట్స్కు క్వాలిటీ ఫుడ్ అందించేందుకు హెడ్మాస్టర్లు, టీచర్లు, మధ్యాహ్న భోజన వర్కర్స్ కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. పాతకొత్తగూడెంలోని జడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజన వర్కర్లకు శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వంట చేసే మధ్యాహ్న భోజన వర్కర్లు శుభ్రతకు ఫస్ట్ ప్రియార్టీ ఇవ్వాలన్నారు.
తలకు టోపీ ధరించి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. స్కూల్ ఆవరణలోనే వంట వండాలన్నారు. నాణ్యమైన కూరగాయాలు మాత్రమే వాడాలని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో డీఈవో ఎం. వెంకటేశ్వరాచారి, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ఎన్.సతీశ్, ఎఫ్ఏవో శ్రీనివాస్, ఎంఈవోలు ప్రభు దయాళ్, బాలాజీ, కృష్ణయ్య పాల్గొన్నారు.